"జాబిల్లి కోసం ఆకాశమల్లె ...వేచాను నీ రాకకై"......పాటకు అనుకరణ అనుకుని మొదట సరిగా చదవలేదు..........కాని చదివిన తరువాత కవితలోని కొన్ని చరణాలు నిజంగా హత్తుకు పోయాయి ......ఇక్కడ చేర్చబడ్డాయి. కవి లక్ష్మణ్ గారికి శుభాభినందనలతో.........
కృష్ణయ్య కోసం ఆ రాధలాగ.....
కృష్ణయ్య కోసం ఆ రాధలాగ వేచాను తన కోసమే
నా రాజు లేక నిదురైనా పోక కనలేకపోయాను కలలైన రాక
కృష్ణయ్య కోసం ఆ రాధలాగ వేచాను తన కోసమే
మనసూరెను వెన్నెల్లో...జతలేనీ రాతిరిలో...మగసిరి లేక గోదారే వేసారిన కన్నుల్లో
మనసూరెను వెన్నెల్లో...జతలేనీ రాతిరిలో...మగసిరి లేక గోదారే వేసారిన కన్నుల్లో
నా ఊపిరిగా ఉంటానన్నావ్..!!
ఈ లాహిరిలో నువ్వేమైపోయావ్ ??
నీ విరహం నాలోని నిర్వేదనై ...
అల్లాడిపోయా ... నీ ఒడిచేరలేక
తెల్లారదేమో... నీ చూపులేక
రారా అన్నా..నువు రావేం కన్నా?
కృష్ణయ్య కోసం ఆ రాధలాగ వేచాను తన కోసమే
నా రాజు లేక నిదురైనా పోక కనలేకపోయాను కలలైన రాక
కృష్ణయ్య కోసం ఆ రాధలాగ వేచాను తన కోసమే
హరివిల్లూ అందాలూ సిరిజల్లూ మజిలీలూ కనలేదే నువులేనీ ఏ దారుల్లో
హరివిల్లూ అందాలూ సిరిజల్లూ మజిలీలూ కనలేదే నువులేనీ ఏ దారుల్లో
నా హృదయంలో ఏ కడలుందో...
ఒక ఉప్పెనగా నను ముంచిందో...
దిక్కులలో...శూన్యంగా
భావనలో...మౌనంగా
నడిరేయి నదిలో నేనీదలేను
సడిలేని మువ్వలా నేనుండలేను
తెలవారుతుందో...కడతేర్చుతుందో...!!
Sunday, 15 March 2009
Wednesday, 4 March 2009
చేసింది చాలక ఈ సమర్ధింపు చూడండి....
"దివిజ కవుల గుండియలు దద్దరిల అరుగుచున్నడమరపురికి" అంటూ స్వాతిశయంగా చెప్పుకున్న శ్రీనాధ కవి రసికతను తెలిజేసే ఒక పద్యమాట ఇది.....పుట్టు పూర్వోత్తరాలకు ఇక్కడ చూడండి.....తెలియ చేసిన ప్రకాష్ గారికి అభినందనలు.
అలికుల వేణి తో దమలపాకుల బేరము లాడబోయి నే
వలచుటకేమి? శంకరుని వంటి మహాత్ముడె లింగరూపి యై
కలికిమిటారిగుబ్బచనుగట్టుల సందున నాట్యమాడగన్.
Subscribe to:
Posts (Atom)