Sunday 15 March 2009

కృష్ణయ్య కోసం ఆ రాధలాగ.....

"జాబిల్లి కోసం ఆకాశమల్లె ...వేచాను నీ రాకకై"......పాటకు అనుకరణ అనుకుని మొదట సరిగా చదవలేదు..........కాని చదివిన తరువాత కవితలోని కొన్ని చరణాలు నిజంగా హత్తుకు పోయాయి ......ఇక్కడ చేర్చబడ్డాయి. కవి లక్ష్మణ్ గారికి శుభాభినందనలతో.........

కృష్ణయ్య కోసం ఆ రాధలాగ.....
కృష్ణయ్య కోసం ఆ రాధలాగ వేచాను తన కోసమే
నా రాజు లేక నిదురైనా పోక కనలేకపోయాను కలలైన రాక
కృష్ణయ్య కోసం ఆ రాధలాగ వేచాను తన కోసమే

మనసూరెను వెన్నెల్లో...జతలేనీ రాతిరిలో...మగసిరి లేక గోదారే వేసారిన కన్నుల్లో
మనసూరెను వెన్నెల్లో...జతలేనీ రాతిరిలో...మగసిరి లేక గోదారే వేసారిన కన్నుల్లో

నా ఊపిరిగా ఉంటానన్నావ్..!!
ఈ లాహిరిలో నువ్వేమైపోయావ్ ??

నీ విరహం నాలోని నిర్వేదనై ...
అల్లాడిపోయా ... నీ ఒడిచేరలేక
తెల్లారదేమో... నీ చూపులేక
రారా అన్నా..నువు రావేం కన్నా?

కృష్ణయ్య కోసం ఆ రాధలాగ వేచాను తన కోసమే
నా రాజు లేక నిదురైనా పోక కనలేకపోయాను కలలైన రాక
కృష్ణయ్య కోసం ఆ రాధలాగ వేచాను తన కోసమే

హరివిల్లూ అందాలూ సిరిజల్లూ మజిలీలూ కనలేదే నువులేనీ ఏ దారుల్లో
హరివిల్లూ అందాలూ సిరిజల్లూ మజిలీలూ కనలేదే నువులేనీ ఏ దారుల్లో

నా హృదయంలో ఏ కడలుందో...
ఒక ఉప్పెనగా నను ముంచిందో...

దిక్కులలో...శూన్యంగా
భావనలో...మౌనంగా
నడిరేయి నదిలో నేనీదలేను
సడిలేని మువ్వలా నేనుండలేను
తెలవారుతుందో...కడతేర్చుతుందో...!!