లేత అరచేతిలో పెట్టిన గోరింటాకు
బుగ్గల్లో పండే వైనం
చిలిపి కళ్ళతో మనసులను
గిల్లే పరువాల ప్రాయం
తుళ్ళింతల కెరటాలు పైకెగసి పడే సందేహాల సంద్రం
గోదారొడ్డున ఇసుక తిన్నెల్లో దొరికే
గువ్వరాళ్ళ గందరగోళం
అన్నీ తమకే తెలుసనే నడమంత్రపు సిరుల సైన్యం
వెన్నెల లో మెరిసి
పాలల్లో తడసి
మిణుగురులై ఎగసి
చినుకులలో వెలిసి
తేనెల్లో విరిసి
తొలిపొద్దున కురిసే
మంచుబిందువులై నునులేత సూర్య కిరణాలకే
కరిగి నీరయిపోయి
శ్రీగారి పదహారణాల చిత్రణ బావుంది.
కొట్టుకొచ్చింది ఇక్కడ నుంచి