Wednesday 6 May 2009

గోళీలాడుకుందాం రా...

చిన్నప్పుడు గోలీలు (మా హైదరాబాద్ వాళ్ళం ఇలాగే అంటాం...గోళీ అనం) ఆడిన అందరికీ ఏంటో ఉత్సాహం కలిగించే టపా...ఒక కన్నేయండి.......చైతన్య గారికి అభినందనలతో

http://chaitukaburlu.blogspot.com/2009/04/blog-post.html

Tuesday 5 May 2009

ఏ ఇల్లు వదిలాడమ్మ ఈ తుంటరి వసంతుడు వలపు వెల్లవేయకుండా?

ఉష గారి వసంతాగమన ఉత్సాహం ఎంత భావుకత నింపిందో చూసిన
http://maruvam.blogspot.com/2009/05/blog-post_05.html

వ్యాఖ్యల్లో, కవయిత్రి తాను చూసి మనకు వినిపించిన ఋతురాగాలను ఆలకించటం మాత్రం మరవకండేం......అభినందనలతో.......!

Monday 6 April 2009

వాన

నల్ల మబ్బులు , వాన , భూమి ఇవి చూస్తె సాధారణంగా భావుకులకు ఏమనిపిస్తుంది?......మట్టి వాసన, ప్రియురాలు, విరహం, కలయిక, పులకరింపు.....ఇవే కదా?

ఇందుకు భిన్నంగా ఆత్రేయ గారికి వచ్చిన ఊహ చూడండి ఎంత బావుందో. చినుకుల దారాలతో నల్ల గాలి పటాలు.....ఓహ్! నేను చెప్పటం ఎందుకు .....మీరే అనుభవించండి.



నీటి దారాలతో
నల్ల గాలిపటాలు ఎగరేస్తూ
ఉత్సాహం పరవళ్ళుతొక్కుతుండగా
ఆనందపు గంధాన్ని జగమంతా నింపుతుంది...నేల

నేల ఒడిలో చేరి,
తమకంలో, తావి మరిచి,
పువ్వుల్లా విచ్చు కుంటూ, నీటి కిరీటాలిచ్చి
తన చేతిలో తరించి పోతున్నాయి..మెల్లగా ..చినుకులు

జారే చినుకు తెరల
వెనక దోబూచులాడుతూ
నిలవలేక వాటినూపుతూ, చిన్న పిల్లల్లా..
తమెక్కడున్నాయో చాటుతున్నాయి.. చల్ల గాలులు.




క్లుప్తంగా ఎంత భావాన్ని అందించారో కదా. మేష్టారు..జోహార్లు.
http://aatreya-kavitalu.blogspot.com/2009/04/blog-post_06.html

Sunday 15 March 2009

కృష్ణయ్య కోసం ఆ రాధలాగ.....

"జాబిల్లి కోసం ఆకాశమల్లె ...వేచాను నీ రాకకై"......పాటకు అనుకరణ అనుకుని మొదట సరిగా చదవలేదు..........కాని చదివిన తరువాత కవితలోని కొన్ని చరణాలు నిజంగా హత్తుకు పోయాయి ......ఇక్కడ చేర్చబడ్డాయి. కవి లక్ష్మణ్ గారికి శుభాభినందనలతో.........


కృష్ణయ్య కోసం ఆ రాధలాగ.....
కృష్ణయ్య కోసం ఆ రాధలాగ వేచాను తన కోసమే
నా రాజు లేక నిదురైనా పోక కనలేకపోయాను కలలైన రాక
కృష్ణయ్య కోసం ఆ రాధలాగ వేచాను తన కోసమే

మనసూరెను వెన్నెల్లో...జతలేనీ రాతిరిలో...మగసిరి లేక గోదారే వేసారిన కన్నుల్లో
మనసూరెను వెన్నెల్లో...జతలేనీ రాతిరిలో...మగసిరి లేక గోదారే వేసారిన కన్నుల్లో

నా ఊపిరిగా ఉంటానన్నావ్..!!
ఈ లాహిరిలో నువ్వేమైపోయావ్ ??

నీ విరహం నాలోని నిర్వేదనై ...
అల్లాడిపోయా ... నీ ఒడిచేరలేక
తెల్లారదేమో... నీ చూపులేక
రారా అన్నా..నువు రావేం కన్నా?

కృష్ణయ్య కోసం ఆ రాధలాగ వేచాను తన కోసమే
నా రాజు లేక నిదురైనా పోక కనలేకపోయాను కలలైన రాక
కృష్ణయ్య కోసం ఆ రాధలాగ వేచాను తన కోసమే

హరివిల్లూ అందాలూ సిరిజల్లూ మజిలీలూ కనలేదే నువులేనీ ఏ దారుల్లో
హరివిల్లూ అందాలూ సిరిజల్లూ మజిలీలూ కనలేదే నువులేనీ ఏ దారుల్లో

నా హృదయంలో ఏ కడలుందో...
ఒక ఉప్పెనగా నను ముంచిందో...

దిక్కులలో...శూన్యంగా
భావనలో...మౌనంగా
నడిరేయి నదిలో నేనీదలేను
సడిలేని మువ్వలా నేనుండలేను
తెలవారుతుందో...కడతేర్చుతుందో...!!

Wednesday 4 March 2009

చేసింది చాలక ఈ సమర్ధింపు చూడండి....

"దివిజ కవుల గుండియలు దద్దరిల అరుగుచున్నడమరపురికి" అంటూ స్వాతిశయంగా చెప్పుకున్న శ్రీనాధ కవి రసికతను తెలిజేసే ఒక పద్యమాట ఇది.....పుట్టు పూర్వోత్తరాలకు ఇక్కడ చూడండి.....తెలియ చేసిన ప్రకాష్ గారికి అభినందనలు.

తొలకరి మించు దీవగతితోపదుకాణము మీద ఉన్న ఆ
అలికుల వేణి తో దమలపాకుల బేరము లాడబోయి నే
వలచుటకేమి? శంకరుని వంటి మహాత్ముడె లింగరూపి యై
కలికిమిటారి
గుబ్బచనుగట్టుల సందున నాట్యమాడగన్.


Saturday 21 February 2009

పరిపూర్ణ పురుష లక్షణాలు...

ఉత్తమ స్త్రీ లక్షణాలు ఏమిటో పదో తరగతి కుర్రాడినడిగినా చెప్పేలా ప్రాచుర్యం చేసిన మన సమాజం పురుష లక్షణాలకు అంత ప్రాచుర్యం ఇవ్వకపోవటం పెద్ద ఆశ్చర్యం కాదు....ఆ లక్షణాలను వివరిస్తూ పరిమళం గారు రాసిన టపా ఇది.

అన్న మదము , అర్ధ మదము ,
స్త్రీ మదము , విద్యా మదము ,
కుల మదము , రూప మదము,
ఉద్యోగ మదము ,యౌవన మదము.................


వీటితో పాటు ఇంకా చాలా కూడా చెప్పారట పెద్దలు............. ఇక్కడ చదవండి .......A tall order definitely

Friday 20 February 2009

శ్రీ శ్రీ గారి "ఋక్కులు"

ఈ రోజేంటో అదృష్టం...అనుకోకుండా....శ్రీ శ్రీ గారి ఇంకో కవిత కూడా పరిచయమయింది. నిజంగా శ్రీ శ్రీ కాదేది కవిత్వానికనర్హం అన్నది తలుపు గొళ్ళెం, హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళాల గురించి - కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు బిల్లల గూర్చి కాదు అని తెలిసింది కూడా ఇపుడే......పోస్టు చేసిన సాహితీకృష్ణ గారికి అభినందనలతో.....శ్రీ శ్రీ గారి "ఋక్కులు" ఇక్కడ

శ్రీ శ్రీ గారి "మహాప్రస్థానం" యొక్క అంకిత పద్యము

శ్రీ శ్రీ గారి మహా ప్రస్థానాన్ని పరిచయం చేస్తానంటూ టపాలు రాస్తున్న మధురవాణి గారి బ్లాగులోని మొదటి టపా...శ్రీ శ్రీ గారి "మహాప్రస్థానం" యొక్క అంకిత పద్యము ఇక్కడ




Tuesday 20 January 2009

జాజుల జావళి.

నేను మెచ్చిన భావ కవయిత్రులలో నిషిగంధ గారు ఒకరు. వారి బ్లాగు "మానస వీణ" లో "జాజుల జావళి" అనే వర్గంలో ఉన్నఇరవయ్యారు కవితలూ నాకు నచ్చినవే. వాటిని అన్నిటినీ చూడాలంటే ఇక్కడ.

ఇవి ఎంత నచ్చాయంటే వీటిపై నాలుగు భాగాల సమీక్ష కూడా రాసాను. అవి చూడాలంటే ఇక్కడ చూడండి.