Monday 6 April 2009

వాన

నల్ల మబ్బులు , వాన , భూమి ఇవి చూస్తె సాధారణంగా భావుకులకు ఏమనిపిస్తుంది?......మట్టి వాసన, ప్రియురాలు, విరహం, కలయిక, పులకరింపు.....ఇవే కదా?

ఇందుకు భిన్నంగా ఆత్రేయ గారికి వచ్చిన ఊహ చూడండి ఎంత బావుందో. చినుకుల దారాలతో నల్ల గాలి పటాలు.....ఓహ్! నేను చెప్పటం ఎందుకు .....మీరే అనుభవించండి.



నీటి దారాలతో
నల్ల గాలిపటాలు ఎగరేస్తూ
ఉత్సాహం పరవళ్ళుతొక్కుతుండగా
ఆనందపు గంధాన్ని జగమంతా నింపుతుంది...నేల

నేల ఒడిలో చేరి,
తమకంలో, తావి మరిచి,
పువ్వుల్లా విచ్చు కుంటూ, నీటి కిరీటాలిచ్చి
తన చేతిలో తరించి పోతున్నాయి..మెల్లగా ..చినుకులు

జారే చినుకు తెరల
వెనక దోబూచులాడుతూ
నిలవలేక వాటినూపుతూ, చిన్న పిల్లల్లా..
తమెక్కడున్నాయో చాటుతున్నాయి.. చల్ల గాలులు.




క్లుప్తంగా ఎంత భావాన్ని అందించారో కదా. మేష్టారు..జోహార్లు.
http://aatreya-kavitalu.blogspot.com/2009/04/blog-post_06.html