Tuesday 23 September 2008

ఆకుపచ్చని తడిగీతం

ప్రకృతి మాత ఒడిలో కూర్చుని తదేకంగా ఆ తల్లి చేసే వింతలు, విడ్డూరాలు చూపే బాలుడిలా......ప్రకృతి కన్యను చాటు నుంచి చూసి ఆమె చూపే హోయలు, అందాలకు పరవశించే రసికుడిలా..... ఎన్ని కోణాలలో చూడుచ్చో ఈ ప్రకృతిని. అలా అన్ని కోణాలు చూపించే ఈ అద్భుతమైన వర్ణన చూడండి. బాబా గారి కలం నుంచి జాలు వారిన ఇంకో ఆణి ముత్యం ఈ ఆకుపచ్చని తడిగీతం
మేఘాలూ నేలా
రాత్రి చుంబించుకొన్నట్లున్నాయి.
తెల్లవార్లూ వాన కురుస్తానే ఉంది.

నల్లని మంచుగడ్డ కరిగిపోయింది.

ప్రశాంత తరువుల్లోకి ప్రాత:కాలం
తడితడిగా ప్రవేశించింది.
వందగుమ్మాలతో వెదురు పొద
స్వాగతం పలికింది.

సూర్యకిరణాల కిలకిలారావానికి
లిట్మస్ పేపర్ లా ఆకాశం రంగు మారింది.

తీగమొక్కలు జారిపోయిన పట్టును
మళ్లా వెతుక్కొంటున్నాయి.

తడినేలపై పడి పరావర్తనం చెందిన
లేకిరణాలు, ఆకుల క్రింద దాక్కొన్న
చీకటిని తరిమేస్తున్నాయి.

చెట్ల ధూళి వాన గుంటలలో చేరి
ఆకుల అందాలను చూస్తూ విస్తుపోతోంది.

మబ్బు అంచుల జరీ మెరుపులతో
పోటీ పడే ఈకల కోసమై
ఓ పక్షి శ్రద్ధగా ప్రీనింగ్ చేసుకొంటూంది.

తలంటుకొన్న యవ్వనిలా శోభిస్తున్న
పొగడ చెట్టు గాలికిరణాలలో
పత్రాలను ఆరబెట్టుకొంటూంది.

ఉదయపు గొంతులోంచి
ఆకుపచ్చని తడిగీతం
రెక్కలుకట్టి ఎగురుతూంది.
మేఘాలవతల వరకూ
సౌందర్యం పరచుకొంది.

తటాకం అంతవరకూ భద్రంగా
దాచుకొన్న తామరదుంపకు
కొత్తచిగుళ్లు లేస్తున్నాయి
నేల ఆలపించే ప్రాచీన గీతాన్ని చిత్రించటానికై.

తడిచిన సీతాకోకచిలుక
కవిత్వంపై వాలి రెక్కలల్లార్చింది.

http://sahitheeyanam.blogspot.com/

Friday 12 September 2008

పయనమయే ప్రియతమా ....!

అద్భుతమైన భావుకతతో, గుండెను చివుక్కుమనిపించే భావనతో, మృధు మధురమైన "సరస" భరితమైన ఈ ఒక పేజీ కథ నాకు చాలా నచ్చిన కథల్లో ఒకటి. నాకు నచ్చిన "గుడి -వాన-ప్రేమ-బాధతో కూడిన సంతోషం" అనేవి అన్నీ సమ పాళ్ళలో ఉండటం చేత అనుకుంటాను చాలా నచ్చింది ఇది. రాసిన "నిషిగంధ"గారికి అభినందనలతో ......

http://nishigandha-poetry.blogspot.com/2008/09/blog-post.html

Sunday 10 August 2008

మత్కుణ ప్రశస్తి

మత్కుణ ప్రశస్తి నల్లి పై మంచి నిందా స్థుతి వ్రాసిన కవి చంద్రమోహన్ గారికి అభినందనలు.

నల్లి బాధలు సార్వజనీకం మరి !

శివుడద్రిని శయనించుట,
రవిచంద్రులు మింటనుంట, రాజీవాక్షున్
డవిరళముగా శేషునిపై
పవళించుట, నల్లి బాధ పడలేక సుమీ!


నల్లి బాధలను తెలియచెప్పే చాటువుపరిచయం చేసిన కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

Thursday 31 July 2008

"స్త్రీ మధ్యము" సన్నబడటానికి అతి రమణీయ వర్ణన-సంకుసాల నృసింహ కవి

తే. గీ. ఒత్తుకొని వచ్చు కటి కుచో ద్వృత్తి
చూచితరుణి తను మధ్య మెచటికో తొలగి
పోయెఉండెనేనియు కనబడ కుండె? అహహ!
ఉద్ధతుల మధ్య పేదల కున్దతరమే


ఈ పద్యాన్ని పరిచయం చేసిన సూర్య ప్రకాష్ గారికి, ప్రస్తావన తెచ్చిన నాగమురళి గారికి ధన్యవాదాలు.

ఉపమా కాళిదాసస్య

“కుసుమే కుసుమోత్పత్తి: శ్రూయతే నతు దృశ్యతే
బాలా తవ ముఖాంబోజే దృశ్యమిందీవర ద్వయం”

పువ్వునుండి పువ్వు పుట్టుతుందని వినడమే గానీ ఎన్నడూ చూడలేదు. కానీ ఓ అమ్మాయీ, నీ ముఖమనే తామర పూవులో నాకు రెండు నల్ల కలువలు కన్పిస్తున్నాయి.

మంచి పద్యం పరిచయం చేసిన చంద్రమోహన్ గారికి, దానికి సంబంధించిన మంచి కథను చెప్పిన సుజాత గారికి కృతజ్ఞతలు

Monday 23 June 2008

మనసా.. ఇంకా తోడుకోసం ఎదురు చూస్తున్నావా??

మనసా..తోడుకోసం ఎదురు చూస్తున్నావా??

తోడుగా నిలవాలంటే.. నమ్మకం కుదరాలి

నమ్మకం కుదరాలంటే.. ప్రేమ వికసించాలి

ప్రేమ వికసించాలంటే.. చనువు ఏర్పడాలి

చనువు ఏర్పడాలంటే.. సఖ్యత పొందాలి

సఖ్యత పొందాలంటే.. పరిచయం కావాలి

పరిచయం కావాలంటే.. ఆకర్షింపగలగాలి

అందం లేని చోట ఆకర్షణ లేదు..

నీ అందం వరకూ చేరాలంటే నా అందం తొలి మెట్టు!!

పిచ్చి మనసా.. ఇంకా తోడుకోసం ఎదురు చూస్తున్నావా??

http://oohalanni-oosulai.blogspot.com/2008/06/blog-post_7515.html

Sunday 22 June 2008

బాటసారి---by saahithii

కాలానికి కాళ్ళు మాత్రమె

యుగాల రహదారిలో

సెకెనుల సకలాలపై

ఓ జీవిత కాలపు పయనం

నెను లేవలెను అన్న బలవంతంగా నా కాళ్ళు సాగదీసి నిలబెదుతుంది

నేను రాను అంటున్న రక్కసంగా తన వెంట లాక్కు పొతుంది

నేను నడవనన్న తానె ఎదురొచ్చి గతమై గడిచి పొతుంది

ఈ పయనంలో ...

తనను దాటి నన్ను పొనీదు

నన్ను దాటి తాను పొలెధు

నన్ను గెలవనీదు ....ఓడనీదు

చచ్చెదాక చావనీదు .

కలిసి రాని కాలం నాతొ కలిసి నడుస్తుంటే

కలవలెని కలల తీరాన్ని కంటిపాప కలవరిస్తొంది

చిత్రంగా లెదూ....?

ఈ కాలం చెసె గలాటానికి గులాము చెసె నవాబు నెను .

నా రెపటిని నేటిగా నాకిచ్చిన ఈ నిమిషాన్ని..నిన్నటి తిమిరానికి తిరిగియ్యలెను

అలా అని నా కాల్ల కింద నలుగుతున్న ఈ నెటిని అలానే అదిమివుంచనూ లెను

అందుకె నీరు కారుతున్న ఈ నిమిషాలను బొట్టు బొట్టుగా పొగెసి

నాకంటి పాప కొలనులొ స్వప్న సౌధాలు నిర్మించుకుంటున్న..

ఈ గతుకుల బతుకులొ భారమైన క్షనాలను

బాద్యతగా బద్రపరుస్తూ,వాటిని అనుభవాలుగా

అనువదించి నా రెపటి తరానికి దారి చూపె దీపాలుగా వదిలి వెలుతున్నా...

చెరువవుతున్న కొద్దే దూరమవుతున్న ఈ ఆనదాల ఎండమావిలో

ఎక్కుళ్ళై వుపక్రమించె నా ధుఖ్ఖానికి దప్పిక తీర్చె కన్నెటి చెలమల్ని తవ్వుకుంటున్నా...

నిన్న నాకొక ఙాపకం

నెడు నాకొక వ్యపకం

రెపన్నది ఎప్పుడూ ఓ ప్రస్నే

ఙాపకాల వ్యపకంలొ రెపటి ప్రస్న

............ సవాలు కావచ్చు

....సమాధి కావచ్చు

నా ప్రతి నెటిలో రెపటి నన్ను ప్రస్నించె ఈ ప్రవళికకు జాబు వెతికె బతుకు బాటసారిని నేను.

http://www.orkut.com/CommMsgs.aspx?cmm=22046375&tid=2599650205147162120

Friday 2 May 2008

కాలం-బొల్లోజు బాబా


భవిష్యత్తంటూ ఏమీ ఉండదు

అనంతమైన అవకాశాలన్నీ

వర్తమానంలోకి కుప్పకూలుతాయి.

వర్తమానమూ ఒక భ్రమే

ఎందుకంటే దాన్ని చేరగానే గతంగా మారిపోతుంది కనుక.

గతం మాత్రమే నిజంగా నిజం

జ్ఞాపకాల మచ్చలు, జీవితాన్ని నిర్ధేశించే అనుభవాలు

కళ్ల వెనుక కదలాడే నులివెచ్చని దృశ్యాలు

కళ్లు మూసేదాక వెంటాడుతూంటాయి.

http://sahitheeyanam.blogspot.com/2008/04/blog-post_27.html

Sunday 27 April 2008

వ్యాకరణ ఆవశ్యకత

యద్యపి బహునాధీషే తథాపి పఠపుత్ర వ్యాకరణం

స్వజనః శ్వజనః మాభూత్ సకలం శకలం సకృత్ శకృత్

(భావం: నాయనా నీవు శాస్త్రాలు, వేదాలు నేర్వకున్నా మానె కానీ, వ్యాకరణం నేర్చుకో! ఎందుకంటే స్వజన (మన వాళ్ళు) అన్న శబ్దాన్ని శ్వజన (కుక్కలు) అనకుండా, సకలం (సర్వం) అన్న శబ్దాన్ని శకలం (ముక్క/లు) అని పలకకుండా, సకృత్ (మంచి పని) అన్న శబ్దాన్ని శకృత్ (మలం) అని పలకకుండా ఉండడానికి - అని ఒక తండ్రి తన కుమారునికి చెబుతున్నాడు.)

http://telugusahityavedika.wordpress.com/2007/08/14/addanki-3/

అమృతం కురిసిన రాత్రి-దేవరకొండ బాల గంగాధర్ తిలక్

http://prajakala.org/mag/2007/06/amruthamkursina_1

రాత్రి కురిసిన వర్షం --Bhanu

రాత్రి కురిసిన వర్షం

అర్ధరాత్రి చెంపలపై ఆత్మీయపు తడి తగిలి లేస్తే
కిటికీ అవతల వర్షం కురుస్తోంది
తెల్లని పువ్వయి విచ్చుకున్న ఆకాశపు హృదయం నుండీ
సౌహార్ద్రం జాల్వారినట్లు వాన
జననాంతర సౌహృదాలేవో జలజలా మేల్కొలుపుతుంది


అర్ధరాత్రి కిటికీ లోంచీ వర్షాన్ని చూస్తుంటే
తెలియని రసప్రపంచపు రహస్య ద్వారమేదో తెరచుకున్నట్లుంటుంది
నీలిరంగు చీకటిలో నీడలు కదలాడినట్లు
మార్మిక ఛాయలేవో మనసును కలవరపెడతాయి
తడిసిన మట్టి వాసనతో గాలి శరీరాన్ని చుడితే
సాంద్రమూ సన్నిహితమూ అయిన స్వప్నమేదో స్పర్శించినట్లుంటుంది


సగం తెరిచిన కిటికీ రెక్కపై చిత్రమైన సంగీతాన్ని ధ్వనించే చినుకులు
నిద్రకూ మెలకువకూ మధ్య నిలిచి
నిర్ణిద్ర గానాన్ని వినిపిస్తున్నట్లుంటుంది
మంద్రస్థాయిలో వినిపించే జంత్రవాయిద్యపు సంగీతవిభావరిలో
తన్మయమై పోయిన మనస్సు
తెలియకుండానే పొలిమేర దాటి నిద్రలో జోగుతుంది
తెరలు తెరలుగా దృశ్యం అదృశ్యంలోకి మాయమయినట్లుగా


తెల్లారి లేచి చూస్తే_
అప్పుడే తలంటు పోసుకుని కురులారబెట్టుకుంటున్న జవ్వనిలాగా
పచ్చని కాంతితో ప్రపంచం కిటికీ లోంచీ స్వఛ్చంగా నవ్వుతుంది
రాత్రి అనుభవాల్ని గుండెలో జ్ఞాపకాలుగా పదిలపరచుకున్నట్టు
గడ్డిపూల మీద మెరిసే నీటిబిందువులు.

http://lalithya.blogspot.com/2007/09/blog-post.html

Saturday 26 April 2008

ఏడకి పోతాండ్రు??

ఏడకి పోతాండ్రు??
నమస్తే అన్నా!! ఎట్లున్నారే?? అంతా బాగేనా?? ఇన్ని దినముల సంది గా మూలన పడున్నా.. గివలా ఎందుకో ఊరు మీదకు పొవాలే అని తెచ్చిండ్రు. పొద్దుగాల నుండి ఒక్కటే చక్కర్లు. ఇక ఇంటికి పొతాంటే మీరు కానొచ్చినారు.. మాట మాట కలుపుకుంటూ పోదాము రాండ్రి.అసలు పొద్దుగాల రోడ్డు మీదకు రాగానే మస్తు పరెశాను అయ్యినా.. ఏడికాడికి గిట్లా తవ్విపెట్టినారు ఏమని? నడవలేక నడవలేక నడిచినా!! ఏమో మెగా సిటీ అంటున్నారు కదా, జుమ్మున పొదాం అనుకున్నా.. నత్త మల్లే నడిచి వచ్చినా.. తోవంతా తవ్వింది.. గాడ ఆ ఎక్స్ ప్రెస్స్ వే కడుతున్నారట గా!! రాను రాను ఊరంతా మారిపోయినట్టు కానచ్చే.. గా మెహదిపట్నం - సరోజిని దవాఖాన కాడ చిన్న చిన్న ఇల్లు ఉండే.. ఇప్పుడన్నీ మిద్దలే!! ఆడే కాదు.. మొత్తం అట్లనే ఉంది. ఆ పంజగుట్ట ట్రాఫిక్ లో గంట ఇరుకున్నా.. కదలలేము, నిలవలేము, హార్న్ లు కొడతానే ఉంటిరి.. కాలు పెట్టనీకి సందు లేదాడ.. గీ బైకుల మీద పొరగాళ్ళు పొతానే ఉన్నరు.. ఒక్కడు నన్ను డొక్కలో పొడిచిండు. నేనయితే నోరు మూసుకున్నా.. ముందర ఎవడో లొల్లి చెసినాడు. ఓ యమ్మా.. నరకమంటే గింతే అనుకున్నా. ఎట్లొ హైటెక్ సిటీ కాడకు పొయినా నిక్కుతూ నీల్గుతూ.. ఏం జబర్దస్తుగుంది ఆ మిద్దే.. నాకైతే దిమ్మతిరిగిందనుకో రాదు.. బానే నేర్వబట్టిరి అనుకున్నా.. ఆ రాస్తాలో గన్నీ గట్లానే ఉన్నయ్.. నా షెహరేనా అనిపించింది. మేగా సిటీ నుండి గ్రేటరు సిటీ గా మారుతున్నారటగా??అటు నుండి... కోఠీకి పోవాల్సి వచ్చె!! అగుతూ నడుస్తూ వెళ్లింటిమి. సుల్తాన్ బజార్లో తిరుగాతా ఉంటే .. అమ్మా.. ఇది నా షహరే అని నమ్మకం కుదిరింది. గవె గల్లీలు, గవె దుక్కణాలు. అప్పట్లో ఉన్నట్టు జనం లేరు గాని, సందడిగా మాత్రం ఉందనట్టు. ఈ కొత్త పోరగాళ్లంతా గవివో "సెంట్రల్లు" అంటూ తిరుగుతాండ్రట గా.. నా చెవిన పడ్డది. అటె ఉన్న ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ కి ఎల్లగానే పాణం సమ్మగయ్యింది. ఏన్నెన్ని సినెమాలు ఈడ..అన్నీ యాదికి వస్తూనే ఉన్నయ్. కనీ ఇదేంది ఇంత ఉక్కగా ఉంది. గాలే లేకపాయే!! సరె.. అని అటు నుండి... మల్లా మెహిదిపట్నం వచ్చినా.. అప్పటికే ఓళ్ళు ఊహనమయ్యిందా.. గైనా ఈ పొరగాడు.. ఒకటే గోల చెవిలో .. పీక కొసిన వేట లెక్క ఒక్కటే కేకలు. అప్పు ఇచ్చినోడు కాడ కూడ అట్లా గదమాయించడేమో... దబాయించి మరీ కుర్సోబెడుతున్నాడు. ఇప్పుడె ఆ పోలీసు వచ్చి నన్ను దబా దబా బాదిన్నాడు. ముసల్దానని సూడకుండా.. అయ్యినా ఈడు మళ్ళా షురువయ్యిండు. ఇప్పుడు కనీశం ఎనిమిది-పది మంది ఎన్నడు ఎక్కుతారో.. నేను ఎప్పుడు కదులుతానో మల్లగుల్లలు పడతాంటే మీరు వచ్చిండ్రు.ఇది నేను పుట్టి పెరిగిన ఊరేనా?? ఈళ్ళంతా నా మనుషులేనా అని ఓ అనుమానం వచ్చి పడ్డాది. నాకు తెల్వదా ఈ మనుషుల గురించి అనుకున్నా గాని సానానే మారిపొయిండ్రు మీరంతా.. ఈ ఉరుకులేంది?? ఈ పరుగులేంది?? ఒక్కడైనా నిదానంగా ఉంటడా అంటే.. ఎవడూ కానరాకపోయె. ఈ రోడ్లు, మిద్దెలు, సిటీలు, సెంట్రల్లు అన్నీ బానే ఉన్నై.. రేపు మా ఆటో లన్నీ మూల పడేసి ఆ కాబుల్లోనే తిరిగుతారేమో!! బానే అనిపిస్తాంది.. .కానీ మీరెమి గిలా దేనికీ కాకుండా పోతాండ్రు. పైసలు కట్టీ, ఎందుకలా మా ముందు సీట్లలో ఏలాడుతున్నారు? ఆడకూతుర్లను నడిమిట్ల దించేస్తారా.. పక్కకు జరగము అంటే. జర్రంత ఓపిక పట్టలేరు.. ట్రాఫిక్ లో!! అసలు "ఆప్ జావో .. ఆప్ జావో" అని లేట్ లతీఫ్ లు గా పిలిచేటోరు గదా మిమల్ని.. మీరేనా గిట్ల కాళ్ళు గాలిని పిల్లి లెక్క సెక్కర్లు కొడతాండ్రు?? ఎమయ్యింది మీకు?? ఎటు పోతాండ్రు మీరు?? ఎరుకేనా??****************************************************************************************************************The city of laidbackness నుండి The restless city గా మనం ఎదుగుతున్న(??) వైనం అగమ్యగోచరంగా ఉంది. సిటి విస్తరిస్తూనే ఉంది, మనమే ఇరుక్కుగా మారిపోతున్నాము. వాతావరణమే కాదు.. మన మనసులు అలాగే ఉన్నాయి. హైదరాబాదుతో అనుబంధం ఉన్నవాళ్ళే కాదు.. ఏ కొంచం తెలిసిన వాళ్ళూ కూడా "ఏంటిది??" అని ప్రశ్నించేలా చేసుకుంటున్నాము. ఆటో అన్నట్టు .. మన గమ్యం ఎటో ఎమీ తెలియదు.. కనీసం దారినైనా ఆశ్వాదిద్దామా??






http://oohalanni-oosulai.blogspot.com/2008/04/blog-post.html

శ్రమ ఏవ జయతే

శ్రమ ఏవ జయతే
అప్పుడే తెల్లారింది. రాత్రి భోజనం చెయ్యలేదేమో సాహెబ్ మొహం బాగా అలసి పోయిందిరాత్రి పెద్ద యుద్ధమే జరిగింది మా చిన్న సాహెబ్ తో
నా వల్ల రాబడి తగ్గింది కాబట్టి అమ్మెయ్యమంటాడు చిన్న సాహెబ్.నాకు జీవితానిచ్చిన అమ్మని అమ్మలేనని అంటాడు బాషా సాహెబ్దీన్ని వారసత్వం గా తీసుకోలేనంటాడు చిన్న సాహెబ్.దీనితో తన కొత్త జీవితాన్ని ప్రారంభించనంటాడు.
బాషా సాహెబ్ మాత్రం కొంత కాలం అనుభవం గడిస్తే తప్ప తన సంస్థను అప్పజెప్పనంటాడు.
ఇలా రాత్రి చాలా వేడిగానే సాగింది వాళ్ళిద్దరి మాట తీరు.ఇది చాలా రోజుల నుంచీ సాగుతున్నదే.నిన్న రాత్రి పరాకాష్టకి చేరుకున్నట్టుంది. నాకెప్పుడు నిద్ర పట్టిందో తెలియదు,తెల్లారి చూస్తే నా వడిలో బాషా సాహెబ్ నిద్రపోతున్నాడునేను తనకు జీవితాన్ని ఇచ్చిన మాట సంగతేమిటో కానీ,బాషా సాహెబ్ రాక మాత్రం నాకు జీవితం లో ఎన్నో కోణాలని చూపించింది.వెయ్యి ఏళ్ళకు సరిపడా జీవితానుభవం నేర్పించింది అన్నింటికీ మించి ప్రేమిచడం నేర్పింది,ప్రేమించబడడం లో ఆనందాన్ని తెలియచెప్పింది.జీవితపు తీపిని చూపించింది కష్టపడి పని చేయగా కలిగిన విజయం లో ఆ తీపి లో రెట్టింపు మాధుర్యాన్ని అనుభవింపచేసింది. ఈ తత్వం ఎలాంటి ఉన్నత శిఖరాలకు తీసుకేళుతుందో ప్రత్యక్షం గా నాకు చూపించింది.అందులో నన్ను భాగస్వామ్యురాలిని చేసింది ****************************దాదాపు పాతికేళ్ళ కిందటి మాటమూడు కాళ్ళా ముద్దుగుమ్మగా ఎంతో మంది మేధావుల సృష్టిని నేను
ఊహ తెలిసింది మాత్రం ఖాన్ సాహెబ్ దగ్గరేపొద్దునే స్నానం చెయ్యించేవాడు ఖాన్ సాహెబ్ ప్రతి శుక్రవారం మసీదు లో నాకు ప్రత్యేక ధూపం వెయ్యించే వాడుప్రతి రోజు రాజేంద్ర నగరు నుంచీ మెహదీపట్నం వరకు మా ఇద్దరి ప్రయాణం.దాదాపు ముప్పావు గంట సేపు.
ఖాన్ సాహెబ్ మనసు నాకు మెల్లెగా అర్ధమవుతున్న తరుణం లో ఖాన్ సాహెబ్ కి తీవ్ర అనారోగ్యం వచ్చిందితనలాగే చూసుకునే వాళ్ళకోసం తీవ్రం గా అన్వేషణ మొదలు పెట్టాడు.
ఒక డ్రైవరు గా కన్నా ఖాన్ సాహెబ్ నాకు ఒక వ్యక్తిగా ఎక్కువ ఇష్టంచేసే పని పట్ల నిజాయితీ,నిబద్ధత ప్రతి క్షణం కనిపించేది.
అదే తత్వం నన్ను చాలా కాలం ఎవరికీ అమ్మనివ్వకుండా ఆపింది.వచ్చే గిరాకీల్లో ఏదో ప్రత్యేకమైనది చూసేవాడు.ఏదో అసంతృప్తి తో బేరం వదులుకునే వాడు
సంక్రాంతి పండుగ రోజులవి.ఆ రోజు ఖాన్ సాహెబ్, నేను రాజేంద్ర నగర్ లో మా దినచర్య మొదలు పెట్టాము.
ప్రతి రోజూ మొదటి బోణీ చేసే పోచమ్మ ఆ రోజు కొత్తగా కనిపించింది.పంట చేతికందిందేమో, తాకట్టు నుంచీ విడిపించుకున్న నగలతో మెరిసి పోతోంది.ఆరు పదులు దాటినా ఎవరిమీద ఆధార పడని పోచమ్మ అంటే మా సాహెబ్ కి ఎంతో గౌరవం.
మెల్లెగా నేను ప్రయాణం సాగిస్తున్నాను.సుమారు పాతికేళ్ళ వయసున్న బక్క పల్చని కుర్రాడు నన్ను ఆపాడు.ఏదో తెలియని నిరాశ స్పష్టం గా కనిపిస్తోంది.ఎక్కడో అన్యాయాన్ని ఎదుర్కున్నట్టు ఉన్నాడు. బస్తీకి కొత్తేమో.ఇక్కడ ఇవి సహజమని తెలియదనుకుంటాను పాపం
అతన్ని చూడగానే తెలియని ఆత్మీయత నాలో పొంగింది.అక్కున చేర్చుకుని ఓదార్చాలనుకున్నాను.ఇక్కడి మనుషుల గురించి మొత్తం చెప్పెయ్యాలనుకున్నాను.కానీ నాకు మనుషుల లాగా చెప్పడం రాదే! నాకు తెలిసినదల్లా నన్ను ఆశ్రయించిన ప్రతి ఒక్కరినీ సుఖం గా వాళ్ళ గమ్య స్థానాలకి చేర్చడం మాత్రమే!
ఖాన్ సాహెబ్ కిక్కు ఇవ్వడం తో నేను మళ్ళి నా ప్రయాణాన్ని సాగించాను.దూరం గా నల్లభై ఏళ్ళ నిండు వ్యక్తి.సూటూ బూటు లో ఉన్నాడు.ఈ తీరు వాళ్ళంతా సాధారణం గా అందరితో కలిసి ప్రయాణించడానికి ఇష్టపడరు.మీటరుకి ఇంకాస్త ఎక్కువ ముట్టజెప్పి అందరినీ దిగబెట్టమని డ్రైవరుతో ఒప్పందం కుదుర్చుకుంటారు అంతా చేరాల్సింది ఒకటే చోటికన్నప్పుడు మార్గ మధ్యం లో ఈ తేడాలు ఏంటి అని మా ఖాన్ సాహెబ్ ఇలాంటివి అస్సలు ప్రోత్సహించేవాడు కాదు.
పక్కన దెబ్బతిన్న కారుని చూసి, ఖాన్ సాహెబ్ ఆ వ్యక్తిని ఎక్కించుకున్నాడు.గమ్మత్తుగా ఆ వ్యక్తి ఎలాంటి బేషజాలు లేకుండా కూర్చున్నాడు.నా అంతరంగం సాహెబ్ కి అర్ధమయ్యిందనుకుంటాను,వెంటనే ఇదే విషయాన్ని అడిగేసాడు
” అదేంటి సాహెబ్ అలా అడిగావు,నేనూ మనిషినే,వీళ్ళూ మనుషులే కదా,వీళ్ళ పక్కన కూర్చోవడానికి అభ్యంతరం దేనికి “
“మీరు బాగా ఉన్నోళ్ళు కదా బాబయ్య ” అని జంకుతూ అందుకుంది పోచమ్మ
“అమ్మా!రెక్కలే మనకు చుట్టాలు కదమ్మా.మరి ఇందులో ఉన్నోడూ,లేనోడూ ఏంటమ్మా!”
ఈ మాటలు విన్న నాకు ఎంతో ఆనందం వేసింది.
“కడుపు నిండింది కాబట్టి మీరు ఎన్ని మాటలైనా మాట్లడతారు లేండి సార్! అవసరం మీది కాబట్టి మా పక్కన కూర్చున్నారు గానీ ” కోపం గా అందుకున్నాడు ఆ యువకుడు
“అంత కోపమెందుకొయి! నేనూ ఈ మట్టిలో పుట్టిన వాడినే.నాకు కష్టం సుఖం తెలుసోయ్” “ఊరుకోండి సార్!ఇక్కడ ఇలానే మాట్లడతారు,మా లాంటి వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం చేతులు ముడుచుకుంటారు .
అడిగేవాడికి చెప్పేవాడు లోకువని,ప్రతి ఇంటర్వ్యూ లో ఏవేవో ప్రశ్నలడుగుతారు.మీకు నిజం గా ఉద్యోగం ఇచ్చే ఉద్దేశ్యం ఉండదు సార్.ఇది వరకే అమ్ముడు పోయుంటారు సార్.మీరంతా ఇంతే సార్” అని ఆవేశం గా తన బాధను మొత్తం వెళ్ళగక్కాడు

“అబ్బాయి!బాగా ఆవేశం లో ఉన్నావు..ఎక్కడ తప్పు జరుగుతోందో తెలుసుకో.మళ్ళీ ప్రయత్నించు ” అని చెప్పుకొస్తున్నాడు ఆ వ్యక్తి
“మూడేళ్ళనుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నాను సార్!నాకు ఉద్యోగం వస్తుందని,వాళ్ళకి మూడు పూటలా భోజనం పెడతానని ఉన్న పొలాన్ని అమ్మేసారు సార్ మా వాళ్ళు! బస్తి ఉద్యోగం లో కష్టం తక్కువని, ఉన్న ఊరిని వదిలి వచ్చాను సార్! ” అని కనీళ్ళు పెట్టుకున్నాడు ఆ యువకుడు
“మా ఊళ్ళో డిగ్రీ పూర్తి చేసిన మొదటి వ్యక్తి నేనే సార్! ఇక్కడికి వచ్చాక అర్ధమైంది సార్ మా ఊరి తెలివితేటలు ఎక్కడా పనికిరావని. కూర్చుని చేసే ఉద్యోగం చేస్తానని మా ఊరంతా నా మీద ఆశలు పెట్టుకుంది. మళ్ళీ తిరిగి మా ఊరికి వెళదాం అంటే అభిమానం అడ్డొస్తోంది సార్! ” అని చెప్పుకొస్తున్నాడు యువకుడు
“బాబూ! మేము ప్రతి ఇంటర్వ్యూ లో చూసేది ఒక్కటే.ఒక విషయాన్ని మీరు యే విధం గా అర్ధం చేసుకున్నారు అన్నదే,మీ వల్ల మా సంస్థకు ఎంత వరకు లాభం అని మాత్రమే.ఆ కొన్ని నిమిషాలలో మీరు ఇది నిరూపించుకుంటే చాలు ” అని చెప్పాడు ఆ వ్యక్తి.
“మీ తరం వాళ్ళంతా కష్టపడి పని చెయ్యగలరు. సరైన దిశానిర్దేసం లేకనే నిరుద్యోగ సమస్య ఇంకా మన దేశాన్ని వెన్నాడుతోంది . ఎవరో నీకు ఉపాధి కల్పిస్తారని ఎదురుచూసేబదులు,నువ్వే నీ లాంటి పది మందికి ఎందుకు జీవితాన్ని ఇవ్వకూడదు ?
“అబ్బయ్యా….2 రూపాయలో నేను పూల వ్యాపరం మొదలు పెట్టినా.ఇద్దరు కొడుకులనీ సర్కారీ నౌకరీ వచ్చేంత వరకు సాకినా. కాలుమింద కాలేసుకుని తిందామని ఆశపడినా.ఈ రెక్కలు సుఖపడడం ఆ దేవుడికి ఇష్టం లేదేమో. ఇద్దరు బిడ్డలూ పాపపు సొమ్ముకి అలవాటు పడినారు.
పరుల సొమ్ము వద్దని ఎన్నో సార్లు జెప్పినా. ఒకడి కడుపు గొట్టి తినే కూడు అరగలేదు. మళ్ళీ నా పూల వ్యాపారానికి వచ్చేసినా. నేను రోజూ తినే మెతుకులు ఎవరి దగ్గరా అన్యాయం గా సంపాదించినది గాదు.ఆ సంతోసం తోనే బతుకీడుస్తున్నా ” అని పోచమ్మ తన గోడు చెప్పుకొచ్చింది
“చెప్పడానికి బాగానే ఉంటాయి సార్ ఇలాంటి మాటలు,నా మీద నమ్మకం తో పెట్టుబడి పెట్టేది ఎవరు సార్,ఇన్ని మాటలు చెప్పిన మీరు పెడతారా? ” అన్నాడు యువకుడు
“తప్పకుండా నువ్వు కష్టపడతావ్ అని నిరూపించుకో ,నీ మీద పెట్టుబడి నేను పెడతాను ,ఎలా నిరూపించుకుంటావ్ అన్నది నీకే వదిలేస్తున్నా” అని సవాల్ విసిరాడు ఆ వ్యక్తి.దిగబోతూ తన పేరూ,అడ్రస్సు ఆ యువకుడి చేతిలో పెట్టి మరీ వెళ్ళిపోయాడు.
నాకు ప్రయాణమూ కొత్త కాదు,ప్రయాణీకులూ కొత్త కాదు.ఇలాంటి రోజు మాత్రం ఎప్పుడూ నా అనుభవం లో రాలేదు .
పోచమ్మ దిగాల్సిన సమయం వచ్చేసింది. “అబ్బయ్యా! నీ అంత సదువుకున్న దాన్ని గాదు.నిషానీ దాన్ని నేను సెప్తున్నా అనుకోనంటే ఒక్క మాట సెప్తాను. ప్రతి పనిలో కష్టం ,సుఖం రెండూ ఉంటాయి.ఒకటి లేక పోతే రెండో దాని ఇలువ తెలియదు.రేపు ఎంత సంపాదించినా,ఎంత ఎత్తుకెదిగినా ఎక్కడ మాత్రం పక్కనోల్ల సొమ్ముక్కి ఆశపడద్దు.మొదటి ముద్ద తినే ముందు ఈ మాట ఆలోచించు” అని పోచమ్మ చెప్పి దిగేసింది
నాలో ఎన్నో ఆలోచనలను మొదలయ్యాయి.ఎలాగో అలా రోజుని గడిపే నాకు ఈ రోజు కొత్త ఊతపిరి పోసింది.
“ఎక్కడ దిగాలి అబ్బయ్యా” అంటూ ఖాన్ సాహెబ్ నిశబ్దాన్ని ఛేదించాడు
“తెలియదు సాహెబ్”
“మరి ఎక్కడికి వెళ్దామని ఎక్కావ్ ?”
“ఏమో సాహెబ్ గుర్తులేదు.నీకు తెలిసిన ఏదైనా పని దగ్గర దిగబెట్టు సాహెబ్”
“సదువుకున్నాల్లకి ఇప్పించే పని నాకేమి తెలుసు అబ్బయ్యా”
“కూలీ పని అయినా చేస్తాను సాహెబ్ “
“పేనా బట్టుకునే సేతులు,పార బట్టలేవు అబ్బయ్యా”
“తప్పదు సాహెబ్,నా రోజు గడవాలి అంటే తప్పదు”
“నా కాడ ఒక పని ఉంది అబ్బయ్యా,నీ సదువికి మాత్రం తగినది కాదు.నువ్వు సేత్తా అంటే ……”
“తప్పకుండా చేస్తాను సాహెబ్,అన్యాయం కానిది అంటే తప్పకుండా చేస్తాను” అంటూ ఉత్సాహం గా అందుకున్నాడు ఆ యువకుడు
“ఈ నా బేటీనీ తిప్పాల.వచ్చిన దానిలో ఇద్దరికీ సగం సగం” అని నన్నూ చూపిస్తూ అన్నాడు సాహెబ్
నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పిన రోజది.ఖాన్ సాహెబ్ చేతి నుంచీ బాషా సాహెబ్ చేతికి మారిన రోజది
చాలా త్వరగా బాషా సాహెబ్ నన్ను మచ్చిక చేసుకున్నాడు.ఖాన్ సాహెబ్ కి గురి కుదిరింది బాషా సాహెబ్ మీద.పక్క ఊరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నన్ను ఒంటరిగా బాష సాహెబ్ దగ్గర వదిలి పెట్టి పోయేవాడు
మెల్లెగా ఖాన్ సాహెబ్ ఆరోగ్యం మరింత క్షీణించింది.చూపూ మందగించింది.నన్ను ఇదివరకటిలాగా చూసుకోలేక పోతున్నాననే బెంగ ఎక్కువ అయ్యింది
బేగం సాహిబాను అత్తగారింట్లో దిగపెట్టి నట్టు నన్ను ఎన్నో జాగ్రత్తలు చెప్పి,కన్నీళ్ళాతో బాషా సాహెబ్ కి అప్పగించాడు అప్పుడప్పుడు వచ్చి నన్ను పూలతో అలంకరించి చూసుకుని పోయేవాడు ఖాన్ సాహెబ్
బాష సాహెబ్ తో కలిసిపోవడానికి నాకు ఎక్కువ కాలం పట్టలేదు. మా ఇద్దరి మనస్తత్వం దాదాపు ఒకేలా ఉండడం తో ఒకరి మనసు ఒకరికి చాలా త్వరగా అర్ధం అయ్యింది
బాష సాహెబ్ కి పని పట్ల ఎంతో నిబద్ధతతో పాటు,తనలాంటి ఎంతో మదికి ఉపాధి కల్పించాలి అన్న ఉద్దేశ్యం ఉండేది.
అదే ఆశయం గా మారి రాత్రీపగళ్ళు కష్టపడేలా చేసింది.బస్తీ లో ఒక ప్రముఖ ఆటో సంస్థ అధినేత గా ఎదిగినా,తన దిన చర్య మాత్రం నాతోనే ప్రారంభించేవాడు
ప్రతి రాత్రీ తాను ఆ రోజు చేసినవ్వన్నీ నాతో చెప్పుకునేవాడుమనసు భారం గా ఉన్న రోజు నాతో కలిసి నిద్రపోయేవాడు
మా అనుభంధం చాలా విచిత్రం గా అనిపించేది నా తోటి ఆటోలకు.నాకే ఆశ్చర్యం గా ఉంటుంది.ఎక్కడి నేను,ఎక్కడి సాహెబ్ అని.
********చల్లటి నీళ్ళు కాళ్ళ మీద పడ్డాయి.చోటా సాహెబ్ నా టైర్లను కడుగుతున్నాడుఏదో పశ్చాతాపం కళ్ళల్లో స్పష్టం గా కనిపిస్తోందినాకూ దుఖం పొంగుకొచ్చింది.బిడ్డ రాత్రంతా ఎంత బాధ పడ్డాడో!
నన్ను మొదటి సారి అధిరోహించిన తన్మయత్వం లో ముందుకు సాగుతున్నాడు చోటా సాహెబ్.“శతమానం భవతి” అని మనస్పూర్తిగా ఆశీర్వదిస్తూ నేనూ సాగిపోతున్నా……


http://vaagdevi.wordpress.com/2008/04/20/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b1%87%e0%b0%b5-%e0%b0%9c%e0%b0%af%e0%b0%a4%e0%b1%87/

Thursday 10 April 2008

Why I Write-George Orwell

1947
http://www.k-1.com/Orwell/index.cgi/work/essays/write.html

o chinni motimaa--sri

o chinni moTimaa...
nee kadha emiTi ammaa!!!!!
ninna reyi kalalo peTinna mudduku saakshagaaee
udayam naa buggapai kanipinchaavu..
naa premanu talachina vela nuvvu naachentaku vastunnavu??
emiTi nee maayaa...!!!
adam lo ninnu chusina veLLa pedivipai chirunavvu bayaTaki raanu anTunnadi ...
mari madi emo tanalo tane murisipotunnadi..
ika aa buggalu emo sigguto muggulu vestunnavi.....
tunTari aalochanalanu chentaku rammani saiga chestunnava..???
leka kannule chuuDani kotta roopanni chusina aanandamaa..
o chinni moTimaa ikanaina chepu amma ..
nee vale erra baDDa aa bugga chaaTuna unna maaTTa emiTo...SRI

http://www.orkut.com/CommMsgs.aspx?cmm=22046375&tid=2593761255174499811

శూన్యం-సుభ్రమణ్యం

శూన్యం
నువ్వు వెళ్ళిపోయావు ..... !
చుట్టుతా ... శూన్యం ....!
ఎటుచూసినా శూన్యం .....!

శూన్యాన్ని పారద్రోలే ....
ఓ ..... బలీయ ఆయుధం కోసం .....,
అవిశ్రాంతంగా వెతుకుతున్నాను ..... నేను ........ !

ఎక్కడో దూరంగా ....
మెరుపు మెరిసింది .....!
అయినా ...... చుట్టూ ..... శూన్యం .....!


వేల కాంతి దీపాలు ...
వెలుగుతున్నాయి ... చుట్టూ .....!
అయినా ...... చుట్టూ ..... శూన్యం .....!

కోటి కాంతులతో ... ప్రభాకరుడూ
...మిల మిలా ... మెరుస్తున్నాడు ..!
అయినా ...... చుట్టూ ..... శూన్యం .....!

కోటి మంది జనాన్ని ..
కూడగట్టుకుని .....
చుట్టూ .... పోగేసుకున్నాను ...!
అయినా ...... చుట్టూ ..... శూన్యం .....!

గాలిలో ఎగురుతున్న ...
రాగాలనన్నింటినీ .... కట్ట కట్టి ....
చెవిలో పోసుకున్నాను .....!
అయినా ...... చుట్టూ ..... శూన్యం .....!

ప్రకృతిలోని రంగులన్నింటినీ ...
ఏరి కోరి .... పిండి ... పిండి ....,
కంట్లో పోసుకున్నాను ....!
అయినా ...... చుట్టూ ..... శూన్యం .....!

సృష్ఠిలోని రుచులనన్నింటినీ .....
ఏర్చి కూర్చి .... ముద్దచేసి .....
నోట్లో .. పోసుకున్నాను ......!
అయినా ...... చుట్టూ ..... శూన్యం .....!

లోకంలోని ఆనందాన్నంతా ......
రంగరించి ..... ముద్దచేసి .....
మనసుకి ... పట్టించుకున్నాను ....!
అయినా ...... చుట్టూ ..... శూన్యం .....!

నీ జ్ఞాపకాలన్నింటినీ ......
చుట్టూ ... ఒలకబోసుకుని .....
మళ్ళీ ..... మళ్ళీ .....
ఏరుకునే ప్రయత్నం ..... చేస్తున్నాను .....!
అయినా ...... చుట్టూ ..... శూన్యం .....!


సర్వేంద్రియాలతో .... దేహం పొడుచుకున్నా .....
కానరాని ఈ శూన్యంలో .......
అక్షరాల్లో ..... అర్ధాల్నీ ....,
పదాల్లో ..... భావాన్నీ ..... వెతుక్కుంటూ ......,
వ్యర్ధ తాపత్రయం .... పడుతున్నాను .....!

నీవు లేని శూన్యాన్ని ......
వృధా కవిత్వంతో నింపే ప్రయత్నం చేస్తూ ......,
కాగితాల్ని ...ఖరాబు చేస్తున్నాను ...!

ఎప్పుడైనా ..... నువ్వు చూడకపోతావా ..... ???
#ఎప్పుడైనా ..... నీ కంట పడకపోతుందా ..... ???
అనే ... ఓ .... వెర్రి ఆశావాదంతో ..........! - శ్రీ శైలు .....!
(12 - March - 1997, 05:17 AM; Kothi Residence, Hyderabad)

http://www.orkut.com/CommMsgs.aspx?cmm=22046375&tid=2591819470363643402&start=1

శూన్యం=Yamini CR

నీవు లేని శూన్యాన్ని
కవిత్వంతో నింపే
వ్రుధాప్రయత్నం చేస్తున్నా
ఎపుడైనా నువ్వు చూడకపోతావా అని
యాద్రుచ్చికంగా...
మారేలా ఉంది
ఇదో వ్యసనంలా

ఈ రాతలు నీకు
పోటీనా?!
కాదు కాదు
కేవలం నీ నిశ్శబ్దం
సైతం సుగంధ పరిమళం
వెదజల్లే అవకాశంగా...
నలిగినకొద్దీ సౌరభాన్ని
అందించే మరువంలా

ఈ పిచ్చిగీతలే
బావున్నాయి అంటున్నారంతా
అదేదో పేరు కూడ పెట్టారు
ఏంటబ్బా అది?! - ఆ! గుర్తొచ్చింది
ఫీల్ కవిత్వమట...
అదంటే ఏంటొ తెలియక
నవ్వుకున్నా లోలోపల
పొనీలే ఇప్పుడు తెలిసిందిగా...
నీ చుట్టూ తిప్పి వెనక్కి
గిరాటేశా దిష్టిలవణంలా

బహుశా ఈ అక్షరాలు
నా ఎదలో వెల్లువెత్తే
భావనల సమాహారమేమో...
అందరి హ్రుదయాలనూ
హత్తుకుంటున్నాయి
బహుశా ఈ భావనలు
నావి మాత్రమే కావేమో...
అందరి మనసులను
మమైకం చేసే భావసంద్రంలో
కొట్టుకుపొతున్నాగా...
ఎన్ని దోసిళ్ళతో తాగినా
తీరని దాహంలా

(నిశ్శబ్ద విప్లవమై నా కలాన్ని నింపుతున్న ఓ నేస్తం! ఈ శూన్యం నీకే అంకితం)
http://www.orkut.com/CommMsgs.aspx?cmm=22046375&tid=2591819470363643402&start=1