Thursday, 10 April 2008

శూన్యం-సుభ్రమణ్యం

శూన్యం
నువ్వు వెళ్ళిపోయావు ..... !
చుట్టుతా ... శూన్యం ....!
ఎటుచూసినా శూన్యం .....!

శూన్యాన్ని పారద్రోలే ....
ఓ ..... బలీయ ఆయుధం కోసం .....,
అవిశ్రాంతంగా వెతుకుతున్నాను ..... నేను ........ !

ఎక్కడో దూరంగా ....
మెరుపు మెరిసింది .....!
అయినా ...... చుట్టూ ..... శూన్యం .....!


వేల కాంతి దీపాలు ...
వెలుగుతున్నాయి ... చుట్టూ .....!
అయినా ...... చుట్టూ ..... శూన్యం .....!

కోటి కాంతులతో ... ప్రభాకరుడూ
...మిల మిలా ... మెరుస్తున్నాడు ..!
అయినా ...... చుట్టూ ..... శూన్యం .....!

కోటి మంది జనాన్ని ..
కూడగట్టుకుని .....
చుట్టూ .... పోగేసుకున్నాను ...!
అయినా ...... చుట్టూ ..... శూన్యం .....!

గాలిలో ఎగురుతున్న ...
రాగాలనన్నింటినీ .... కట్ట కట్టి ....
చెవిలో పోసుకున్నాను .....!
అయినా ...... చుట్టూ ..... శూన్యం .....!

ప్రకృతిలోని రంగులన్నింటినీ ...
ఏరి కోరి .... పిండి ... పిండి ....,
కంట్లో పోసుకున్నాను ....!
అయినా ...... చుట్టూ ..... శూన్యం .....!

సృష్ఠిలోని రుచులనన్నింటినీ .....
ఏర్చి కూర్చి .... ముద్దచేసి .....
నోట్లో .. పోసుకున్నాను ......!
అయినా ...... చుట్టూ ..... శూన్యం .....!

లోకంలోని ఆనందాన్నంతా ......
రంగరించి ..... ముద్దచేసి .....
మనసుకి ... పట్టించుకున్నాను ....!
అయినా ...... చుట్టూ ..... శూన్యం .....!

నీ జ్ఞాపకాలన్నింటినీ ......
చుట్టూ ... ఒలకబోసుకుని .....
మళ్ళీ ..... మళ్ళీ .....
ఏరుకునే ప్రయత్నం ..... చేస్తున్నాను .....!
అయినా ...... చుట్టూ ..... శూన్యం .....!


సర్వేంద్రియాలతో .... దేహం పొడుచుకున్నా .....
కానరాని ఈ శూన్యంలో .......
అక్షరాల్లో ..... అర్ధాల్నీ ....,
పదాల్లో ..... భావాన్నీ ..... వెతుక్కుంటూ ......,
వ్యర్ధ తాపత్రయం .... పడుతున్నాను .....!

నీవు లేని శూన్యాన్ని ......
వృధా కవిత్వంతో నింపే ప్రయత్నం చేస్తూ ......,
కాగితాల్ని ...ఖరాబు చేస్తున్నాను ...!

ఎప్పుడైనా ..... నువ్వు చూడకపోతావా ..... ???
#ఎప్పుడైనా ..... నీ కంట పడకపోతుందా ..... ???
అనే ... ఓ .... వెర్రి ఆశావాదంతో ..........! - శ్రీ శైలు .....!
(12 - March - 1997, 05:17 AM; Kothi Residence, Hyderabad)

http://www.orkut.com/CommMsgs.aspx?cmm=22046375&tid=2591819470363643402&start=1

No comments: